శిశు జనన దోషములు & మరణ సంబంధ విషయములు
27 నక్షత్రాల 4 పాదాలలో శిశువు జన్మిస్తే ఫలితం, శాంతి విధానం, మరణం తర్వాత ఇల్లు విడవాలా అనే నియమాలు.
శిశు జనన నక్షత్ర పాద దోషములు
శిశువు జన్మించిన నక్షత్రం, పాదం ప్రకారం ఎవరికి దోషమో ఈ పట్టికలో చూడండి.
| నక్షత్రం | 1 వ పాదం | 2 వ పాదం | 3 వ పాదం | 4 వ పాదం |
|---|---|---|---|---|
| అశ్విని | శిశువుకు, తండ్రికి | మంచిది | మంచిది | మంచిది |
| భరణి | మంచిది | మంచిది | తల్లికి, తండ్రికి | మంచిది |
| కృత్తిక | మంచిది | మంచిది | తల్లికి, తండ్రికి | మంచిది |
| రోహిణి | తల్లికి, మేనమామకు గండం | తల్లికి, మేనమామకు గండం | మేనమామకు | మంచిది |
| మృగశిర | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
| ఆర్ద్ర | మంచిది | మంచిది | మంచిది | స్వల్ప దోషం |
| పునర్వసు | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
| పుష్యమి | మంచిది | తల్లికి, తండ్రికి | తల్లికి, తండ్రికి | మంచిది |
| ఆశ్లేష | స్వల్ప దోషం | ధన హాని | తల్లికి, తండ్రికి | స్వల్ప దోషం |
| మఖ | శిశు గండం | మంచిది | తల్లికి, తండ్రికి | మంచిది |
| పుబ్బ | మంచిది | మంచిది | మంచిది | స్వల్ప దోషం |
| ఉత్తర | తల్లికి, తండ్రికి | మంచిది | మంచిది | స్వల్ప దోషం |
| హస్త | మంచిది | మంచిది | తల్లికి, తండ్రికి | మంచిది |
| చిత్త | తల్లికి, తండ్రికి | తల్లికి, తండ్రికి | స్వల్ప దోషం | సామాన్య దోషం |
| స్వాతి | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
| విశాఖ | బంధు గండం | బంధు గండం | విశేష శాంతి | విశేష శాంతి |
| అనూరాధ | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
| జ్యేష్ఠ | సౌఖ్య హాని | ధన నష్టం | తండ్రికి గండం | సోదర గండం |
| మూల | తల్లికి, తండ్రికి | తండ్రికి గండం | ధన హాని | మంచిది |
| పూర్వాషాఢ | మంచిది | మంచిది | తల్లికి, తండ్రికి | మంచిది |
| ఉత్తరాషాఢ | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
| శ్రవణం | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
| ధనిష్ఠ | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
| శతభిషం | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
| పూర్వాభాద్ర | మంచిది | మంచిది | మంచిది | స్వల్ప దోషం |
| ఉత్తరాభాద్ర | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
| రేవతి | మంచిది | మంచిది | మంచిది | శిశు గండం |
శాంతి విధానము
అమావాస్య, వర్జ్యం, దుర్ముహూర్త సమయాలలో పుట్టినా, మెడకు పేగులు చుట్టుకుని పుట్టినా, తల్లిదండ్రులు లేదా సోదర సోదరీల జన్మ నక్షత్రంలోనే పుట్టినా తప్పక శాంతి చేయాలి. నవగ్రహ జపాలు, దానాలు, నవగ్రహ హోమం, నక్షత్ర శాంతి, రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేయాలి.
మరణ సంబంధ విషయములు
దోషం కలిగించే తిథి, వార, నక్షత్రాలు
రోహిణి, మృగశిర, పునర్వసు, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు; పాడ్యమి, విదియ, షష్ఠి, అష్టమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య తిథులు; ఆది, మంగళ, శుక్ర, శని వారాలు — వీటిలో మరణం సంభవిస్తే దోషం.
తిథి మాత్రమే కలిస్తే అర్ధ దోషం; వారం, నక్షత్రం కలిస్తే త్రిపాద (ముప్పావు) దోషం; తిథి, వారం, నక్షత్రం మూడూ కలిస్తే సంపూర్ణ దోషం.
ఇల్లు ఎంత కాలం విడవాలి
రోహిణి, మృగశిర, మఖ, చిత్త నక్షత్రాలలో ఇంట్లో మరణిస్తే 3 నెలలు; కృత్తిక, పునర్వసు, ఉత్తర, విశాఖ, ఉత్తరాషాఢ నక్షత్రాలలో ఇంట్లో మరణిస్తే 6 నెలలు ఆ ఇంటిని విడవాలి. తర్వాత ఉదకశాంతి మొదలైన శాంతులు చేసుకుని ఇంట్లో ప్రవేశించాలి.
ఇంటి లోపల కాకుండా ఇంటి ఖాళీ స్థలంలో గానీ, బయట ప్రదేశంలో గానీ చెడు తిథి, నక్షత్ర, వారాలలో మరణించినా ఇల్లు ఖాళీ చేయనవసరం లేదు.
మృతకాల చక్రం
మరణించిన రోజున రవి ఏ నక్షత్రంలో ఉన్నాడో, ఆ నక్షత్రం నుండి మొదలుపెట్టి (అభిజిత్‌తో కలిపి 28 నక్షత్రాలు) ఈశాన్య మూల నుండి తూర్పు దిశగా — మూలల్లో మూడు, దిక్కులలో నాలుగు చొప్పున — లోపలికి, మళ్లీ బయటికి వరుసగా రాయాలి.
మరణ నక్షత్రం చక్రం మధ్యలో ఉంటే ఆ ఇల్లు 45 రోజులు విడవాలి. దాని చుట్టూ ఉన్న 8 గదులలో ఉంటే 30 రోజులు. ఇంకా బయటి వరుసలలో (ప్రహరీలో) ఉంటే ఇంటి వారికి దోషం లేదు; ఇల్లు ఖాళీ చేయనవసరం లేదు.
ఉదాహరణ: మరణ దినాన రవి కృత్తికలో ఉన్నప్పుడు. సందేహం ఉంటే స్వామి వారిని సంప్రదించండి.
ఇవి సంప్రదాయ పంచాంగ నియమాలు. మీ జాతకానికి సరైన శాంతి, ముహూర్తం కోసం స్వామి వారిని సంప్రదించండి.
WhatsApp లో అడగండి