జ్యోతిష విషయములు

రజస్వల విషయములు

ప్రథమ రజస్వలకు మంచి, దోష నక్షత్రాలు; మాసం, తిథి, వారం, లగ్నం, వస్త్రం, స్థలం, రోజు నిర్ణయం.

మంచి నక్షత్రాలు

ఈ నక్షత్రాలలో ప్రథమ రజస్వల అయితే చాలా మంచిది. సంతాన సౌఖ్యం, మంచి భర్త లభిస్తారు.

  • అశ్విని
  • రోహిణి
  • మృగశిర
  • పుష్యమి
  • ఉత్తర
  • హస్త
  • చిత్త
  • స్వాతి
  • విశాఖ
  • అనూరాధ
  • మూల
  • ఉత్తరాషాఢ
  • శ్రవణం
  • ధనిష్ఠ
  • శతభిషం
  • ఉత్తరాభాద్ర
  • రేవతి

దోష నక్షత్రాలు

ఈ నక్షత్రాలలో ప్రథమ రజస్వల అయితే దోషం, మంచిది కాదు. వివాహంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. శాంతి నక్షత్రముల పేజీలోని నవవిధ శాంతులు చేయాలి.

  • భరణి
  • కృత్తిక
  • ఆర్ద్ర
  • పునర్వసు
  • ఆశ్లేష
  • మఖ
  • పుబ్బ
  • జ్యేష్ఠ
  • పూర్వాషాఢ
  • పూర్వాభాద్ర

వస్త్రం, సమయం

ఉదయం గానీ మధ్యాహ్నం గానీ తెల్లని, గట్టి వస్త్రం ధరించి ఉండగా ప్రథమ రజస్వల అయిన కన్యకు సుఖం, సౌఖ్యం, సంతాన వృద్ధి, అన్ని విధాల అభివృద్ధి కలుగుతాయి. సుమంగళి యోగం కలుగుతుంది.

మాసాలు

చైత్రం, జ్యేష్ఠం, ఆషాఢం, భాద్రపదం, కార్తీకం, పుష్యం కాకుండా మిగిలిన మాసాలలో రజస్వల అయితే మంచిది.

తిథులు

పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య కాకుండా మిగిలిన తిథులలో రజస్వల అయితే మంచిది.

వారాలు

ఆది, మంగళ, శని వారాలు కాకుండా మిగిలిన వారాలలో రజస్వల అయితే మంచిది. సుఖ సౌఖ్యాలు, మంచి భర్త లభిస్తారు.

లగ్నాలు

మేషం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం కాకుండా మిగిలిన లగ్నాలలో రజస్వల అయితే మంచిది. రజస్వల సమయాన్ని నోట్ చేసుకుని ఆ రజోలగ్నం నిర్ణయించి చెప్పిన జాతక ఫలితాలు ఆమె జీవితంలో సరిపోతాయి.

వస్త్రం రంగు

నీలి, ఎరుపు, రంగురంగుల (చిత్ర), పాత (జీర్ణ) వస్త్రాలు లేదా వస్త్రం లేకుండా కాకుండా, మిగిలిన రంగుల వస్త్రాలలో రజస్వల అయితే మంచిది.

స్థలం

ఇతరుల ఇళ్లలో, ఇతర గ్రామాలలో, ప్రయాణ మార్గమధ్యంలో కాకుండా సొంత ఇంట్లోనే రజస్వల అయితే మంచిది.

ఏ రోజుగా లెక్కించాలి

రజస్వల, ప్రసవం, మైల రాత్రి సమయంలో కలిగితే — ఆ రాత్రిని మూడు భాగాలు చేయాలి. మొదటి రెండు భాగాలలో అయితే ముందు రోజుగా, మూడవ భాగంలో అయితే మరుసటి రోజుగా లెక్కించాలి.

ఇవి సంప్రదాయ పంచాంగ నియమాలు. మీ జాతకానికి సరైన శాంతి, ముహూర్తం కోసం స్వామి వారిని సంప్రదించండి.

WhatsApp లో అడగండి