రాశి ఫలాలు

రాశులు & నక్షత్రములు అంటే ఏమిటి?

రాశి అంటే ఏమిటి?

సూర్యుడు, గ్రహాలు సంచరించే ఆకాశ మార్గాన్ని (రాశి చక్రం) 12 సమాన భాగాలుగా విభజించారు. ఒక్కో భాగం 30 డిగ్రీలు. వీటినే మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశులు అంటారు. మీరు పుట్టిన సమయంలో చంద్రుడు ఉన్న రాశే మీ జన్మ రాశి.

నక్షత్రం అంటే ఏమిటి?

ఇదే రాశి చక్రాన్ని 27 సమాన భాగాలుగా కూడా విభజించారు. ఒక్కో భాగం 13 డిగ్రీల 20 నిమిషాలు. ఇవే అశ్విని నుండి రేవతి వరకు ఉన్న 27 నక్షత్రాలు. చంద్రుడు రోజుకు సుమారు ఒక నక్షత్రం దాటుతాడు. మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఉన్న నక్షత్రమే మీ జన్మ నక్షత్రం.

పాదం అంటే ఏమిటి?

ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అంటే మొత్తం 108 పాదాలు, ఒక్కో రాశిలో 9 పాదాలు. అందుకే జన్మ నక్షత్రం, పాదం తెలిస్తే జన్మ రాశి తెలుస్తుంది. పేరులోని మొదటి అక్షరం కూడా పాదం ఆధారంగానే నిర్ణయిస్తారు.

రాశి ఫలాలు ఎలా చూడాలి?

దిన ఫలాలను మీ జన్మ రాశి ప్రకారం చూడండి. ఇవి ఆ రాశి వారందరికీ వర్తించే సాధారణ గోచార ఫలితాలు. వ్యక్తిగత ఫలితాలు మీ పూర్తి జాతకం, దశలపై ఆధారపడి ఉంటాయి.